నాకు మళ్లీ కంటెస్టెంట్ గా చేయాలని ఉంది..కానీ ఓడిపోతానని భయంగా ఉంది!
on Dec 10, 2022
ఢీ-15 ఛాంపియన్ షిప్ బ్యాటిల్ లేటెస్ట్ గా మరో టీజర్ ని రిలీజ్ చేసింది. కిరాక్ డ్యాన్స్ పెర్ఫార్మెన్సెస్ తో ఆడియన్స్ ని ఉర్రూతలూగిస్తున్న షో ‘ఢీ’. ఇప్పటికి 14 సీజన్స్ పూర్తి చేసుకుని ఆదివారం నుంచి సీజన్ 15 ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధమైపోయింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా రాబోతున్నారు.
ఇండస్ట్రీలో టాప్ యాక్టర్స్ ఎంతోమందికి ఆయన డాన్స్ కోరియోగ్రఫీ కూడా చేశారు..అలాంటి ఇండియన్ మైకేల్ జాక్సన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొరియోగ్రాఫర్ గా.. నటుడిగా.. దర్శకుడిగా.. ఆయన సత్తా చాటారు. నటుడిగా కొన్ని మూవీస్ లో కూడా యాక్ట్ చేసారు. ఇప్పుడు ఢీ-15 లో మెరవడానికి సిద్ధమయ్యారు. కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ తనదైన స్టైల్ లో డైలాగ్ చెప్పి ఎంట్రీ ఇచ్చారు.
ఇక ఈ షోకి హోస్ట్ గా ప్రదీప్ మాచిరాజు అలరించడానికి సిద్దమయ్యాడు. అలాగే ఈ షో లేటెస్ట్ గా రిలీజ్ ఐన టీజర్ లో శ్రద్ధాదాస్ డాన్స్ చేస్తూ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా డాన్సర్స్ తో కలిసి స్టేజి మీదకు వచ్చి "నాకు కంటెస్టెంట్ గా మళ్లీ చేయాలనుంది..కానీ సెలెక్షన్స్ లోనే ఓడిపోతానని నాకు తెలుసు" అని ఒక డైలాగ్ వేసి అందరినీ నవ్వించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
